తెలంగాణకు ఐఎండీ హై అలర్ట్
NEWS Aug 19,2025 07:38 am
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలంగాణను హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్ప పీడనం చోటు చేసుకోవడం భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీఎస్డీఎంఏ.