సచివాలయంలో కాంట్రాక్టర్ల నిరసన
NEWS Aug 19,2025 07:10 am
తెలంగాణ సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి క్యాబిన్ ముందు మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. అప్పులు చేసి పనులు చేశామని, వడ్డీలు, అసలు కట్టలేక నానా తంటాలు పడుతు్నామని వాపోయారు. బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.