తిరుమలకు పోటెత్తిన భక్తజనం
NEWS Aug 19,2025 07:05 am
భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారిని 80 వేల 502 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 890 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవార హుండీ ఆదాయం రూ. 4.88 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 20 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.