జగిత్యాల:నిలిచిపోయిన రాకపోకలు!
NEWS Aug 19,2025 01:12 pm
జగిత్యాల జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఇబ్రహీంపట్నం మండలం యమాపూర్- ఫకీర్ కొండాపూర్ మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెన కొట్టుకుపోయి రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యా యి. గత ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపట్టగా నిధులు రాక పనులు మధ్య లోనే ఆగిపోయాయి.దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు