వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
NEWS Aug 18,2025 07:26 pm
భారీ వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి సత్య కుమార్ యాదవ్. నీటి ద్వారా డయేరియా, జాండీస్, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ, చికున్ గునియా రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ప్రతి జిల్లాలో ఎపిడెమిక్ టీమ్స్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సూపర్వైజర్, ఎంపిహెచ్ ఎలతో ప్రత్యేక బృందాలు, అంబులెన్స్ లు సిద్దంగా ఉంచాలన్నారు.