ఘనంగా పాపన్న జయంతి వేడుకలు
NEWS Aug 18,2025 07:22 pm
జనగామ జిల్లా ఖిలాషాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి, HMS నాయకుడు ఈశ్వర్ ప్రసాద్, గద్దర్ గళం స్థాపకుడు కొల్లూరు సత్తయ్య, జర్నలిస్ట్ ముద్దం స్వామి తదితరులు నివాళులర్పించారు. పాపన్న ఆశయాలను నెరవేర్చాలని పాశం యాదగిరి పిలుపునిచ్చారు. ముద్దం స్వామి ఏఐ సహాయంతో రూపొందిస్తున్న పాపన్న డాక్యుమెంటరీ పోస్టర్‌ను కోట వద్ద ఆవిష్కరించారు.