నిర్మలా సీతారామన్ తో మంత్రి లోకేష్ భేటీ
NEWS Aug 18,2025 07:04 pm
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా కోరారు.