కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
NEWS Aug 18,2025 12:49 pm
ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు కేంద్ర విదేశాంగశాఖ మంత్రితో లోకేశ్ భేటీ అయ్యారు.