కేంద్ర మంత్రి జై శంకర్ తో లోకేష్ భేటీ
NEWS Aug 18,2025 11:59 am
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జైశంకర్ తో సమావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్. ఇటీవల ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించారు. ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలని విన్నవించారు. డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని అన్నారు.