ఉత్తరాంధ్రలో కుండపోత వర్షం
NEWS Aug 18,2025 11:44 am
బంగాళాఖాతంలో కొనసాగుతోంది అల్పపీడనం. వాయుగుండంగా బలపడడంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కుండ పోత వర్షం కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. గడచిన 24 గంటల్లో విశాఖలోని కాపులుప్పాడలో 15.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది.