తెలంగాణను ముంచెత్తిన వర్షాలు
NEWS Aug 18,2025 09:53 am
భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండాయి. బాన్సువాడ మండలంలో కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తోంది సర్వపూర్ వాగు. మొండి సడక్-సర్వాపూర్ బ్రిడ్జి మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతోంది వరద. బిచ్కుంద మండలం శెట్లూరు వాగులో గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. నల్గొండలో బోరు బావి నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది.