తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
NEWS Aug 18,2025 09:44 am
పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని 86,364 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 712 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.46 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం క్యూ లైన్ కృష్ణ తేజా వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.