ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు హౌజ్ అరెస్ట్
NEWS Aug 18,2025 09:39 am
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీశ్ బాబు డిమాండ్ చేశారు. జీవో 49 రద్దు చేసి, భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ అటవీశాఖ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ధర్నా నేపథ్యంలో ముందస్తుగా ఎమ్మెల్యే హరీశ్ బాబు హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే నివాసం ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.