మోదీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి
NEWS Aug 18,2025 08:23 am
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మోదీ అంటూ పేర్కొన్నారు. ప్రధానిని అధికారం నుంచి దించక పోతే మీ ఓట్లు, హక్కులు, స్వేచ్ఛ, రాజ్యాంగం కూడా సురక్షితంగా ఉండవన్నారు. తనను పవర్ నుంచి దూరం చేస్తేనే దేశం బాగు పడుతుందన్నారు.