ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం కుట్ర
NEWS Aug 18,2025 07:56 am
ఫ్యూచర్ సిటీపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అంశం తెరపైకి తేవడం కుట్ర అంటూ పేర్కొన్నారు. రైతుల వద్ద ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను ఫ్యూచర్ సిటీకి తరలించడం కుదరదని రెండేళ్ల క్రితం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని హెచ్చరించానని అన్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఆలస్యంగా తెలుసుకుందన్నారు. ప్రచారాల కోసం వందల కోట్లు ఖర్చు చేసి, ఫ్యూచర్ సిటీ అని రైతులను, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పాలన మీద అవగాహన లేని సీఎం వల్ల నష్టం వాటిల్లిందన్నారు.