తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు
NEWS Aug 18,2025 07:07 am
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషే అంటే, ఎన్నో ఏళ్ల నుండి ప్రాణం పెట్టి పనిచేసిన పాత కార్యకర్తలు ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టదని, వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పిందే అధిష్టానం వింటుందన్నారు. వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్పలేనని, కానీ వాళ్ల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు.