వినకపోతే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదు
NEWS Aug 17,2025 07:42 pm
ఎంత చెప్పినా వినకుంటే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదన్నారు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ , ఎంపీ మల్లు రవి. తన వ్యవహారంపై పీసీసీ చీఫ్ చర్చించారని తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నానని, తన పని కేవలం మంటలు ఆర్పే పని అని, మంటలు పెట్టే పని కాదన్నారు. పార్టీలో విభేదాలు సరి చేస్తూ, అందరు కలిసి పని చేసేలా చూసే బాధ్యత నాదన్నారు. వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయితీపై కూడా నలుగురు సభ్యులతో కమిటీని పార్టీ నియమిస్తుందన్నారు.