జూనియర్ ఎన్టీఆర్ ను నేను తిట్టలేదు
NEWS Aug 17,2025 04:01 pm
జూనియర్ ఎన్టీఆర్ ను తాను తిట్ట లేదన్నారు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. తానంటే గిట్టని వారే ఫేక్ ఆడియో, వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నారా, నందమూరి కుటుంబాలంటే తనకు చాలా అభిమానం అన్నారు. అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలని కోరారు. ఆ వీడియో, ఆడియోలు నావి కావన్నారు. ఇందుకు సంబంధించి తాను ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశానన్నారు ఎమ్మెల్యే.