పాకిస్తాన్ 30 గ్రూపుల్లో నూర్ సభ్యుడు
NEWS Aug 17,2025 02:32 pm
దేశ సమగ్రతకు అవరోధం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న సమాచారంతో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో నూర్ మహమ్మద్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ఉపా చట్టం కింద నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరిద్దరూ నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించామన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో నూర్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు.