బాబర్, రిజ్వాన్ కు పాకిస్తాన్ బోర్డు షాక్
NEWS Aug 17,2025 01:41 pm
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే పాకిస్తాన్ జట్టును పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా సీనియర్ క్రికెటర్లు , కీలక విజయాలు అందించిన బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ లను పక్కన పెట్టింది. మొత్తం 17 మందితో జట్టును ప్రకటించారు. ఈసారి పాకిస్తాన్ టీమ్ కు సల్మాన్ అలీ ఆఘాను కెప్టెన్ గా నియమించింది.