గ్రామాల అభివృద్దిపై సర్కార్ ఫోకస్
NEWS Aug 17,2025 08:32 am
కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అన్నారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంత్రి సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ , బీజేపీలకు నిరాధార ఆరోపణలు చేయడం తప్పా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సర్వ నాశనమైందని వాపోయారు.