రాహుల్ కామెంట్స్ పై ఈసీ సీరియస్
NEWS Aug 17,2025 08:28 am
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓట్ల చోరీకి సంబంధించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. అక్రమంగా ఓట్లు తొలగించలేదని, ఇందుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని కోరింది. ఇప్పటికే అన్నింటిని పరిశీలించి వాటిని జాబితా నుంచి తీసేసినట్లు తెలిపింది. అయితే వివరాలు ఇచ్చేందుకు తాము సుముఖంగా లేమని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని వివరాలు 22 లోపు అందజేస్తామని స్పష్టం చేసింది. కాగా బీహార్ లో ఈసీ 65 లక్షల ఓట్లను తొలగించడంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ.