బనకచర్ల అంశంలో బాబుకు రేవంత్ సపోర్ట్
NEWS Aug 17,2025 08:16 am
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బనకచర్ల అంశంలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిన్న సీఎం మాట్లాడిన తీరు బాబు ప్రసంగానికి కొనసాగింపు మాత్రమేనని పేర్కొన్నారు. గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నామని చెప్పాల్సింది పోయి మౌనంగా ఉండడం దారుణమన్నారు.