భారీ వర్షాన్ని ఆపేసిన సీఎం రేవంత్ రెడ్డి
NEWS Aug 17,2025 07:46 am
ప్రముఖ కవి అందెశ్రీ నోరు జారారు. ఆయన స్వామి భక్తిని చాటుకుంటున్నారు పదే పదే. మాజీ సీఎం కేసీఆర్ పై పదే పదే మండి పడుతున్న అందెశ్రీ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని దేవుడిని చేసేశారు. తన ఇంటి నిర్మాణానికి స్లాబ్ వేస్తున్నామని, ఈ సమయంలో ఒక్క రోజు వర్షాన్ని ఆపాలని తాను సీఎంను కోరానని, ఆయన వెంటనే వర్షాన్ని రాకుండా ఆపారంటూ నోరు పారేసుకున్నారు. ప్రజల కోసం పాడి, రాయాల్సిన కవి ఇలా సర్కార్ జపం చేయడం విస్తు పోయేలా చేసింది.