ఆర్టీసీలో 1500 డ్రైవర్ పోస్టుల భర్తీ
NEWS Aug 17,2025 07:40 am
1500 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీఎస్ఆర్టీసీ. 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 5 ఏళ్ల పాటు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కు 45 ఏళ్లు ఉంటుంది. కనీసం 18 నెలల హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం, హెచ్ ఎం వీ లైసెన్స్ విధిగా ఉండాలి. ఎలాంటి పరీక్ష ఉండదు. దరఖాస్తులతో పాటు ఫిట్ నెస్ పరీక్షల కోసం సంబంధిత ఆర్టీసీ డిపోలలో సమర్పించాలి.