తిరుమల కిటకిట కాసులు గలగల
NEWS Aug 17,2025 07:23 am
భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీవారిని 87 వేల 759 మంది భక్తులు దర్శించుకున్నారు. 42 వేల 43 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.