శ్రీకృష్ణ ఆలయానికి దొండా నరేష్ విరాళం
NEWS Aug 16,2025 10:34 pm
వడ్డాది యాదవ్ వీధిలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణం కోసం వడ్డాది టీడీపీ టౌన్ అధ్యక్షులు దొండా నరేష్ 40 సిమెంట్ బస్తాలు (రూ. 12,000 విలువ) విరాళంగా అందజేశారు. దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని, ప్రజలు సుఖసంతోషాలతో, సమృద్ధిగా జీవించాలని శ్రీకృష్ణ స్వామిని ప్రార్థిస్తూ, తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు. వడ్డాది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, దేవాలయ నిర్మాణానికి తమ సహకారాన్ని అందించారు.