ప్రముఖ జర్నలిస్టు తంగిరాల ఇక లేరు
NEWS Aug 16,2025 04:03 pm
ప్రమఖ జర్నలిస్ట్ తంగిరాల చక్రవర్తి శనివారం హైదరాబాద్ తన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటు. కవిగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేశారు. గత ఏడాదిలో పదవీ విరమణ పొందారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, సంపాదకులు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.