బాబు రెండు కళ్ల సిద్దాంతం మోసం
NEWS Aug 16,2025 03:36 pm
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబుపై. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అంటున్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఎందుకు పోరాడటం లేదన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా జలాలు తీసుకెళ్లే హక్కు ఉందని మీరు పోరాడుతున్నప్పుడు.. కృష్ణా మీద మా వాటా గురించి మేం పోరాడుతుంటే మీకు వ్యతిరేకం ఏమిటి అని ప్రశ్నించారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి జలాల వివాదం రాకూడదు అంటే పునః పంపకాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.