రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై చర్యలు
NEWS Aug 16,2025 03:29 pm
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణా కమిటీ చూసుకుంటుందని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఆదేశిండం జరిగిందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటామని అన్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. పదవులు తీసుకున్నా సరే కనీసం అభివృద్ది పనులకు నిధులు ఇవ్వాలని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.