బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు
NEWS Aug 16,2025 03:19 pm
బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు ఉన్న కమిట్‌మెంట్ ఏ పార్టీకి లేదన్నారు. టెక్నికల్ కారణాలు చూపించి బీజేపీ మోకాలు అడ్డుతోందని ఆరోపించారు. బీసీలకు బీజేపీ బద్ధ విరోధి అని మండిపడ్డారు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలన్నదే మా ప్రయత్నం అన్నారు పీసీసీ చీఫ్.