నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి వరద ఉధృతి
NEWS Aug 16,2025 03:07 pm
భారీ వర్షాల తాకిడికి వరద ఉధృతి కొనసాగుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. 14 క్రస్ట్ గేట్స్ ను 5 అడుగులెత్తి 1,09,578 క్యూసెక్కుల నీళ్లను దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటిమట్టం 587.40 అడుగులు ఉండగా డ్యాం నీటి సామర్థ్యం 305.7464 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 1,72,800 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,44,049 క్యూసెక్కులకు చేరుకుంది.