తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
NEWS Aug 16,2025 08:03 am
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో ఈ రోజు భూపాలపల్లి, సంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.