సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందలేదు
NEWS Aug 16,2025 09:30 am
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తనకు ఇంకా అందలేదని చెప్పారు. అది వచ్చాక స్పందిస్తానని పేర్కొన్నారు. అంతకు వరకు తాను మాట్లాడటం మంచిది కాదన్నారు. తనకు కూడా రాజ్యాంగం పట్ల, భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం పట్ల గౌరవం ఉంటుందన్నారు. న్యాయ సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.