ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయం
NEWS Aug 16,2025 08:23 am
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఫ్రీ బస్సు పథకం ప్రవేశ పెట్టడంతో తమ ఉపాధికి ఇబ్బంది ఏర్పడుతోందంటూ ఆందోళన బాట పట్టారు ఆటో డ్రైవర్లు. దీనిపై స్పందించారు సీఎం. ఆటో డ్రైవర్ల సమస్యలపై సబ్ కమిటీ వేశామన్నారు. కమిటీ సూచనల మేరకు వారికి కూడా న్యాయం చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. పంద్రాగస్టు నుంచి ఫ్రీ బస్సు జర్నీ స్కీం స్టార్ట్ అయ్యింది.