తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ
NEWS Aug 16,2025 07:46 am
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైతే తప్పా నగర వాసులు బయటకు రావద్దని కోరింది. ఇదిలా ఉండగా ఇప్పటికే జోరుగా వర్షం కురుస్తోంది హైదరాబాద్ నగరమంతటా.