తిరుమలకు పోటెత్తిన భక్తజనం
NEWS Aug 16,2025 07:04 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 77 వేల 43 మంది భక్తులు దర్శించుకున్నారు. 41 వేల 859 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈఓ శ్యామల రావు. ప్రస్తుతం భక్యుల క్యూ లైన్ ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.