మెట్‌పల్లి: చైతన్యనగర్‌లో ఇంటి చోరీ
NEWS Aug 16,2025 01:40 pm
మెట్‌పల్లి పట్టణంలోని చైతన్య నగర్‌కు చెందిన గంప అర్చన, రాఖీ పౌర్ణమి సందర్భంగా వారం రోజుల క్రితం తన తమ్ముడి ఇంటికి రాఖీ కట్టేందుకు వెళ్లింది. శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి, ఇంటి తాళం పగలగొట్టి, బీరువాను ధ్వంసం చేసిన దుండగులు 2 తులాల బంగారం, 20 తులాల వెండిని చోరీ చేసి పరారయ్యారు. బాధితురాలు అర్చన ఫిర్యాదు మేరకు, ఎస్‌ఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.