షుగర్, న్యూమోనియా ప్రాణాంతకం
NEWS Aug 15,2025 09:29 pm
వృద్ధులలో డయాబెటిస్, న్యూమోనియా ప్రమాదకరమైన కలయిక. దీర్ఘకాలంగా షుగర్‌తో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి బలహీనపడటంతో, న్యూమోనియా ఇన్ఫెక్షన్ వేగంగా ముదిరి ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. వణుకుతో కూడిన జ్వరం, ఆగని దగ్గు, వేగవంతమైన శ్వాస, గందరగోళం, ఆకలి లేకపోవడం వంటివి తొలి సంకేతాలు. ఈ లక్షణాలు షుగర్ లెవెల్స్‌ను అదుపు తప్పించి తీవ్ర పరిణామాలకు కారణమవుతాయి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ముఖ్యం.