కుప్పం-పులివెందులలో టీడీపీ-వైసీపీ అవకతవకలు: షర్మిల
NEWS Aug 15,2025 04:02 pm
వైసీపీ అధినేత జగన్ కు, సీఎం చంద్రబాబుకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో కుప్పంలో జగన్ చేసిన దాన్నే, ఇప్పుడు పులివెందులలో చంద్రబాబు చేశారని ఆమె ఆరోపించారు. ఇద్దరు నేతలు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, "గతంలో కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని జగన్ కాలరాస్తే, ఇప్పుడు పులివెందులలో చంద్రబాబు అదే పని చేస్తున్నారు.