ఓట్ చోరీ అబద్దం - పవన్ కళ్యాణ్
NEWS Aug 15,2025 10:23 am
ఓడి పోయిన ప్రతీసారి ఓట్ చోరీ అనడం పరిపాటిగా మారిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా కాకినాడలో జెండా ఎగుర వేశారు. సుస్థిర పాలనతోనే అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. మెరుగైన పాలన కావాలంటే కూటమి సర్కార్ మరో 15 ఏళ్ల పాటు ఉండాలన్నారు. లా అండ్ ఆర్డర్ బలంగా లేక పోతే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు . కూటమి సర్కార్ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తోందన్నారు. ఇవాల్టి నుంచి మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.