మొయినాబాద్ ఫామ్ హౌస్ లిక్కర్ పార్టీపై దర్యాప్తు
NEWS Aug 15,2025 01:21 pm
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో లిక్కర్ పార్టీపై దర్యాప్తు చేస్తున్నామన్నారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్. మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో 14 మంది పురుషులు, 37 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అందరూ ఆఫ్రికన్ కంట్రీస్ కి చెందిన వాళ్లేనని పేర్కొన్నారు. 65 బీర్లు, 20 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. వీరి వీసా స్టేటస్ గురించి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలు పూర్తైన తరువాత డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఫామ్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు.