పదవుల కోసం పాకులాడ లేదు
NEWS Aug 15,2025 01:04 pm
ప్రొఫెసర్ కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఎమ్మెల్సీ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడంపై స్పందించారు. తన ప్రయాణం పదవులతో మొదలు కాలేదన్నారు. పదవులతోనే ఆగి పోయేది కాదన్నారు. ఏదో వస్తుందని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నా ప్రయాణం ప్రారంభించ లేదన్నారు. తన లక్ష్య సాదన కోసం తన జర్నీ, పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. జన జీవితంలో అనేక అవాంతరాలు, అడ్డంకులు, ఒడిదుడుకులు ఉంటాయన్నారు. తన ఎన్నికపై ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకోనని, వారి విజ్ఞతకే వదిలేస్తానని స్పష్టం చేశారు.