కేసీఆర్ లాగా పాలించిన నేత దేశంలో లేరు
NEWS Aug 15,2025 12:14 pm
79 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేసీఆర్ లాగా పాలించిన నాయకుడు ఒక్కరు కూడా లేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, టీడీపీ పాలనలో పడావుబడ్డ తెలంగాణను పదేండ్లలోనే అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా మార్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. లక్ష్య సాధన నుంచి పక్కకు జరిగితే రాళ్లతో కొట్టి చంపండన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ పేరు ఎత్తడమే పాపమైన రోజుల్లో పార్టీ పెట్టడం దుస్సాహసమేనని అన్నారు. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా చిరస్థాయిగా నిలిచి పోతారన్నారు.