నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తా - ఎంపీ
NEWS Aug 15,2025 10:38 am
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీరు నోటాకు ఓటు వేసినా, కారు గుర్తుకు వేసినా, చెయ్యి గుర్తుకు ఓటు వేసినా తానే గెలుస్తానని అన్నారు. దేనికైనా వేయండి ఆ ఓటు నాకే పడుతుందన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై అధికారంలోకి వచ్చేలా చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అరవింద్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.