కేసీఆర్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు
NEWS Aug 15,2025 07:26 am
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన ఉద్యమంలో స్వాతంత్ర పోరాట స్పూర్తి ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. స్వయం పాలన కోసం జరిగిన త్యాగాలను స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయొద్దని సూచించారు. స్వాతంత్ర ఫలాలు చివరి గడప వరకు చేరే దాకా పాలకులు కృషి చేయాలని కోరారు కేసీఆర్.