శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు
NEWS Aug 15,2025 07:15 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 66 వేల 530 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 478 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామలరావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్ల లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.