నేడే భారత స్వాతంత్ర దినోత్సవం
NEWS Aug 14,2025 09:44 pm
భారతదేశం నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1947లో 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుండి దేశం కష్టపడి పొందిన స్వేచ్ఛను గుర్తు చేసుకుంటుంది. ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగుర వేస్తారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి చేయడంలో ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటారు. 143 కోట్ల భారతీయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో జెండా పండుగను జరుపుకుంటారు.