కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్
NEWS Aug 14,2025 04:32 pm
అభిమాని హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కన్నడ సినీ నటుడు దర్శన్ పై సీరియస్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. తనకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చింది. వెంటనే దర్శన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో యాక్టర్ ను అదుపులోకి తీసుకుంది. కస్టడీలో సాధారణ ఖైదీలకు ఉన్న సౌకర్యాలనే నటుడికి కల్పించాలని స్పష్టం చేసింది. లేకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.