65 లక్షల ఓటర్ల జాబితా వెల్లడించాల్సిందే
NEWS Aug 14,2025 04:17 pm
సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘానికి. బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 65 లక్షల మంది వ్యక్తుల వివరాలను, వారి తొలగింపుకు గల కారణాలైన మరణం, వలస లేదా నకిలీ వంటి వాటిని ఈసీ వెబ్ సైట్ లో ప్రచురించాలని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 19 వరకు డెడ్ లైన్ విధించింది.